NTV Telugu Site icon

Anakapalle Minor Girl Incident: మైనర్ బాలిక హత్య కేసు.. నిందితుడి ఆచూకీ చెబితే బహుమతి ప్రకటించిన పోలీసులు

Ap

Ap

Anakapalle Minor Girl Incident: అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ చెబితే బహుమతి ప్రకటించారు పోలీసులు.. రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం విదితమే.. కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు. ఇక 20 రోజుల కిందట బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్.. తనని జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని దారుణానికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక పై దాడి చేసేందుకు ప్లాన్‌ చేసిన సురేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి పీక కోసి పరార్ అయ్యాడు.

Read Also: Mahesh Babu: మహేష్ బాబుకి యాక్టింగ్ క్లాసులు చెబుతున్న సీనియర్ నటుడు

అయితే, నిందితుడు సురేష్ కోసం ఏర్పాటు చేసిన 12 బృందాలు కూడా విఫలం అయినట్టు తెలుస్తోంది.. నిందితుడిని పట్టుకోవడంలో చేతులెత్తేశారు పోలీసులు.. దీంతో.. నిందితుడు సురేష్ ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు పారితోషికం ప్రకటించారు.. ఘటన జరిగి 48 గంటలు కావస్తున్నా సురేష్ ఆచూకీ లభించలేదు.. నిందితుడు పాతవి, ప్రస్తుతం ఫోటోలు.. విడుదల చేశారు పోలీసులు.. ఇంతవరకు ఆచూకీ దొరక్కపోవడతో నిందితుడు సూసైడ్ చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. జిల్లా మొత్తం జల్లెడ పట్టినా నిందితుడి ఆచూకీ దొరకలేదంటున్నారు.. మరోవైపు పోలీసుల నిర్లక్యం పై బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నిందితుడు ఆచూకీ కనుక్కొని తమకి అప్పగించకపోతే సూసైడ్ చేసుకుంటానంటున్న హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read Also: Balcony Rent: అక్కడ బాల్కనీ అద్దె నెలకు రూ. 80,000..!

కాగా, నాలుగు నెలల క్రితం మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో ఫోక్సో యాక్ట్ కింద నిందితుడు సురేష్‌ని అరెస్టు చేశారు పోలీసులు.. ఈ ఘటనలో నిందితుడు ఒక నోట్ రాసి ఈ దారుణానికి ఒడిగట్టాడని., అందులో మేటర్ ఆధారంగా కూడ దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నందున కొన్ని విషయాలు వెల్లడించలేమని., ఏప్రిల్ లో మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని., కోర్టులో గుడ్ బిహేవియర్ కింద బెయిల్ మీద వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు మానసిక పరిస్థితి కూడా బాగోలేదంటున్నారు.. మొత్తంగా ఇప్పటి వరకు నిందితుడు ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడుతున్నారు స్థానికులు.