Plane Crash: ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.
Read Also: Navadeep: నేనెక్కడికి పారిపోలేదు.. నాకు డ్రగ్స్ కేసుతో సంబంధమే లేదు!
ఏపీలోని విశాఖపట్నం నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకున్నాక ప్రమాదం జరిగిందని.. రన్‌వే 27పై డీజీసీఏ అధికారులు తెలిపారు. ఈ విమానం బెంగళూరుకు చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ లీర్‌జెట్ 45 విమానంగా తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా దృశ్యమానత 700 మీటర్లు మాత్రమే ఉందని డీజీసీఏ పేర్కొంది. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: PM Modi: కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అవినీతిలో ముందుకెళ్తోంది.. ప్రధాని తీవ్ర విమర్శలు
ఈ ప్రమాదం తర్వాత ముంబై విమానాశ్రయంలో రన్‌వే సమీపంలో విమాన శకలాలు కనిపించాయి. ప్రమాద సమయంలో విమానంలో మంటలు చెలరేగగా.. అత్యవసర సేవల ద్వారా అదుపులోకి తెచ్చారు. లియర్‌జెట్ 45 అనేది కెనడాకు చెందిన బొంబార్డియర్ ఏవియేషన్ విభాగంచే తయారు చేయబడిన తొమ్మిది సీట్ల సూపర్-లైట్ బిజినెస్ జెట్.