NTV Telugu Site icon

ACB Fake Calls: ఏసీబీ పేరుతో డబ్బులు డిమాండ్ చేసే నకిలీ కాల్స్‌పై డీజీ హెచ్చరిక

Acb

Acb

ACB Calls: ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఏసీబీ లేదా స్థానిక పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరారు.

Read Also: Minister Narayana: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం!

ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేసారు. మీపై ఏదైనా కేసు ఉందని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే అధికారికంగా ఫిర్యాదు చేయండని, ఏసీబీ అధికారుల పేరుతో ఎవరైనా మోసం చేయాలని చూసిన వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలనీ తెలిపారు. ఏసీబీ తెలంగాణ అధికారిక వాట్సాప్, ఫేస్‌బుక్, X (ట్విట్టర్) ఖాతాల ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని, బాధితుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కాల్స్ వస్తే తక్షణమే అధికారులకు తెలియజేయాలని ఏసీబీ డీజీ సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల సహకారం అవసరమని, ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే అధికారికంగా ఫిర్యాదు చేయాలని అన్నారు. సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి!