ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్ ఈఎన్సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు.
మియాపూర్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా నంబర్-98లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు మోహన్ నాయక్‌పై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి లెక్కలు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువపై అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!