ACB Raids: అవినీతి వలలో చిక్కిన తహసీల్దార్.. సోదాల్లో కళ్లు చెదిరే డబ్బులు..
- దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు..
- అవినీతి వలలో చిక్కిన గజ్వేల్ తహసీల్దార్..
- రూ.4 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు..
ప్రజాసేవ చేయాల్సిన ఉన్నతాధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తుల వేటలో పడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కాటన్ శ్రవణ్ కుమార్.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో లభించిన డాక్యుమెంట్లు, నగదు చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.
Also Read:Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
కరీంనగర్‌లోని శ్రవణ్ కుమార్ నివాసం, ఆయన సోదరి ఇల్లు, ఇతర కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ. 4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
సోదాల్లో పట్టుబడిన వాటిలో.. రూ. 11.90 లక్షల నగదుతో పాటు రూ. 4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. రూ. 30 లక్షల విలువైన లగ్జరీ కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.
Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్‌కు భారీ స్థాయిలో గ్యాస్..
కరీంనగర్‌లో రెండు సొంత ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, మరో నాలుగు ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలు.. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 2.47 కోట్లుగా తేల్చారు. దాదాపు రూ. 15.66 లక్షల విలువైన విలాసవంతమైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక హోదాను ఉపయోగించుకుని శ్రవణ్ కుమార్ అక్రమంగా ఈ సంపదను ఆర్జించినట్లు ఏసీబీ దర్యాప్తులో స్పష్టమైంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?