ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!

Acb Raids

Acb Raids

ACB Raids: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. భుజంగరావు ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆయన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

భుజంగరావుతో పాటు ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తుల వద్ద కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టైన ఆయన జైలుకు వెళ్లి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

×
×
Ad