ACB Court : చంద్రబాబు వరుస పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Court : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. చంద్రబాబుకు సంబంధించి ఆయన తరఫు లాయర్లు వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. బెయిల్ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని చంద్రబాబు లాయర్లు.. న్యాయమూర్తిని కోరారు.. అయితే, ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని తెలిపింది కోర్టు.. అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడతామని పేర్కొన్న న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
Read Also: MLC Kavitha: తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి..
Also Read
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
అయితే, సీఆర్‌పీసీ ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని లాయర్ల కోరారు.. కానీ, జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్నారు ఇతర లాయర్లు.. కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటున్నారు. కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందని చెబుతున్నారు.. మరోవైపు.. సాంకేతిక కారణాల కోసం చంద్రబాబు లాయర్ల తాపత్రయపడుతున్నారని సీఐడీ తరపు లాయర్లు విమర్శిస్తున్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక, కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ చంద్రబాబు తరపున న్యాయవాది లూథ్రా విజ్ఞప్తి చేశారు.. కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపించారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు.. విచారణకు చంద్రబాబు సకహరించడంలేదని.. కావాల్సిన సమాచారం రావడం లేదంటున్నారు సీఐడీ అధికారులు.. దీంతో.. మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ.. కోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!