NTV Telugu Site icon

Ac Not Working: ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేయని ఏసీలు.. ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి

Mgm

Mgm

అధిక ఉష్ణోగ్రతలతో పాటు భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అమర్చినా ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లులు, అటెండెంట్లు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఆస్పత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు.

Read Also: Disha Patani Bikini: బికినీలో దిశా పటానీ.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

అయితే, నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్‌ యూనిట్‌ ఐసీయూ/హెచ్‌డీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున 8 ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు.. ఓ వైపు ఎండలతో ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లిపోతున్నాయి. ఇక, ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, ఉక్కపోత తల్లులు భరించలేకపోతున్నారు. తమ పిల్లల వ్యాధులను నయం చేసుకుందామని వస్తే ఇక్కడ నరకం చూడాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసికందులు చికిత్స పొందుతున్న వార్డుల్లో ఏసీలు పెట్టి ఏం లాభం అంటూ మండిపడుతున్నారు. మేమే వేడి భరించలేక ఉక్కపోత, చెమటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. ఇక, మా చిన్నారులు ఎలా భరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పని చేయని ఏసీలను వార్డులో ఎందుకు పెట్టారంటూ హస్పటల్ లో వైద్యం కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.