Site icon NTV Telugu

Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్‌లోకి ఎంట్రీ.. ట్రోల్స్‌పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!

Abrar Ahmed

Abrar Ahmed

Abrar Ahmed: సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ ప్లేయర్‌ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై యాజమాన్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు ఫేవరెట్‌గా ఉన్న కావ్యా మారన్ ఒక్కసారిగా విలన్‌లా మారిపోయింది. ఇక ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ స్పందించాడు. మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా, అబ్రార్ అహ్మద్ మాత్రం ఈ విమర్శల గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని సమాచారం. టెలికాం ఏషియా స్పోర్ట్ (Telecom Asia Sport) నివేదికల ప్రకారం.. అబ్రార్ ఈ విమర్శల పట్ల చాలా ప్రశాంతంగా ఉన్నాడట. వీటిని అస్సలు పట్టించుకోవడం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. “అబ్రార్ తన పనితాను చేసుకుపోతున్నాడు. ఈ వివాదాల వల్ల అస్సలు డిస్ట్రబ్ కావడం లేదు.” అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పీసీబీ అధికారులు స్పందించారు. ప్రస్తుతం అబ్రార్ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-3 బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. అందుకే విదేశీ లీగ్‌లలో అతనికి భారీ డిమాండ్ ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రధానంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఒప్పందం కాబట్టి, తాము దీనిపై అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదని పీసీబీ భావిస్తోందట.

READ MORE: IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ అంశంపై తన కాలమ్‌లో స్పందించిన సునీల్‌ గవాస్కర్‌, గత కొన్ని సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్‌ మధ్య జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే ఇటువంటి ప్రతిచర్య సహజమని పేర్కొన్నారు. 2008లో జరిగిన 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడనివ్వలేదని గుర్తు చేశారు. అలాగే 2019లో జరిగిన పుల్వామా వంటి ఘటనలు భారతదేశంలో ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేశాయని తెలిపారు. భారత యాజమాన్యంలో ఉన్న జట్టు పాకిస్థాన్‌ ఆటగాడికి చెల్లించే డబ్బు అక్కడ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుందని, ఆ నిధులను ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశముందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భారత యజమాని ఒక పాకిస్థాన్‌ ఆటగాడికి డబ్బు చెల్లిస్తే, అది పరోక్షంగా భారత సైనికులు లేదా పౌరులపై ప్రభావం చూపే వ్యవస్థకు నిధులు సమకూర్చినట్టే అవుతుంది. ఒక టోర్నమెంట్ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా?” అని గవాస్కర్ ప్రశ్నించారు.

READ MORE: Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

Exit mobile version