NTV Telugu Site icon

Criminal Cases: 2022లో ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదు.. NCRB నివేదిక

Crime

Crime

మునపటి పోలిస్తే 2022 సంవత్సరంలో ఢిల్లీలో 3.3 శాతం క్రిమినల్ కేసులు పెరిగాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. గతేడాది ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2022లో దేశ రాజధానిలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద మొత్తం 2,98,988 కేసులు నమోదు కాగా.. 2021లో 2,89,045 కేసులు నమోదయ్యాయి.

Read Also: Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..

అదేవిధంగా.. 2020 సంవత్సరంలో 2,45,844 మొత్తం కేసులు నమోదయ్యాయి. ఎన్‌సిఆర్‌బి, హోం మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ ప్రకారం.. ఢిల్లీలో 2022 సంవత్సరంలో 501 హత్య కేసులు నమోదయ్యాయి. ఇక.. 2021 సంవత్సరంలో 454, 2020 సంవత్సరంలో 461 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 14,158 ‘మహిళలపై నేరాల’ కేసులు నమోదయ్యాయి. 2021లో 345 కేసులు నమోదు కాగా.., 2020లో 166గా ఉన్న సైబర్ క్రైమ్ కేసులు 2022లో 685కి పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.

Read Also: Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ ఎందుకు ఓడింది..? పరాజయానికి దారితీసిన అంశాలేంటి..?

అదేవిధంగా.. పిల్లలపై నేరాల కేసులు 2022లో 7,029 నుండి 7,400కి పెరిగాయని.. ఇది 2021 సంవత్సరంలో 5,256గా ఉందని డేటా తెలిపింది. 2022లో మొత్తం 5,585 కిడ్నాప్, బందీల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 2021లో 5,475 కేసులు నమోదు కాగా.. 2020లో 4,011 కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. 2021లో వృద్ధులపై నేరాల కేసులు 1,166 నమోదు కాగా.. ఇవి 2022లో 1,313కి పెరిగింది.