Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.
Read Also: Caste Exclusion: జనగామలో చర్చనీయాంశంగా మారిన కుల బహిష్కరణ..
కాగా, ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల సమయానికి 10.82 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో 8.94 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12.33 శాతం, బీహార్‌లో 9.66 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 16.54 శాతం, ఒడిశాలో 7.43 శాతం, జార్ఖండ్‌లో 11.74 శాతం, 8.89 శాతం పోలింగ్ శాతం నమోదు అయింది. అయితే, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైతుండగా.. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ రాజౌరిలో మందకొడిగా ఓటింగ్ కొనసాగుతుంది.
Read Also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
అలాగే, లోక్‌సభ ఎన్నికల చివరి దశలో తమ ఓటు హక్కును పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లను కోరారు. ప్రతి ఓటు ముఖ్యమైనది, ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చురుకుగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది అని ఓటర్లను కోరారు. మహిళలు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.
