Caste Exclusion: జనగామ జిల్లాలో కుల బహిష్కరణ చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన ఓ కుటుంబాన్ని కుల సంఘం పెద్దలు కుల బహిష్కరణ చేశారు. ఈనెల 19న ఆర్థిక సమస్యలతో ప్రభాకర్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. చనిపోయిన 3వ రోజే మృతుడి కుటుంబ సభ్యులకు కుల సంఘం సభ్యుల మధ్య చోటు చేసుకుంది. ఘర్షణతో పలువురు కుల సంఘం పెద్దలు తమను కుల బహిష్కరణ చేశారని, తన భర్త పెద్దకర్మకు తమ కులస్తులు ఎవరు వెళ్లొద్దని హుకుం జారీ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజికవర్గానికి చెందిన పలువురు పెద్దలు తనను, తన పిల్లలను బెదిరించారని, కుల బహిష్కరణ వేధిస్తున్నారని మృతుడి భార్య ఉలెంగుల లలిత శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Read also: Operation Cambodia: కొనసాగుతున్న ఆపరేషన్ కంబోడియా.. 70 ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా
ఆమె ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడు ప్రభాకర్ ఓ కులానికి చెందిన పరపతి సంఘం స్థానిక అధ్యక్షుడు. అయితే సంఘంలో ఆర్థిక లావాదేవీల్లో ప్రభాకర్, వర్గీయుల మధ్య గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభాకర్ మృతి చెందిన మూడో రోజైన ఈ నెల 21న ఉలెంగుల భరత్ అనే కులస్థుడు లలితతో గొడవపడి చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత సంఘానికి చెందిన ఉల్లెంగుల నర్సింహులు, ఉల్లెంగుల రాజేష్, ఉల్లెంగుల సందీప్, యు.సందీప్ లలితతో గొడవ పడ్డారు. తన మూడు తులాల బంగారు గొలుసు పోగొట్టుకున్నందుకు పరిహారం చెల్లించాలని అందులో పేర్కొంది. పెద్దకర్మకు కులస్థులెవరూ వెళ్లకూడదని డిక్రీ జారీ చేసినట్లు ప్రభాకర్ తెలిపారు. దీంతో లలిత, ఆమె ఇద్దరు పిల్లలు పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై టౌన్ సీఐ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Tejaswi Yadav: ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్.. ఆ పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తాడు..!