Site icon NTV Telugu

Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

Abhishek Sharma

Abhishek Sharma

2026 T20 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంబం లభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రపంచ కప్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.

Also Read:IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

సిక్సులు, ఫోర్లతో పరుగులు వరద పారించాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఎనిమిదో ఓవర్ లో అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర చేతిలో చిక్కుకున్నాడు. టీం ఇండియాకు అభిషేక్ రూపంలో తొలి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

Exit mobile version