Site icon NTV Telugu

Abhishek Sharma: “నా స్టైలే ఇంత.. మైండ్‌సెట్ మార్చుకోను!” హ్యాట్రిక్ డకౌట్‌లపై అభిషేక్ శర్మ షాకింగ్ రియాక్షన్..

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూయిస్తాడని నమ్మకం. ఓపెనర్‌గా రంగంలోకి దిగి బౌలర్లకు చుక్కలు చూయిస్తాడు. అయితే.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మూడు మ్యాచుల్లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు అభిషేక్.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న భారత్ తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్‌కు ముందు తన ఆటతీరుపై అభిషేక్ స్పందించాడు. గత మూడు ఇన్నింగ్స్‌లలో తాను ఎలాంటి పరుగులు చేయకపోయినా సరే, తన ఆడే విధానాన్ని (ఇంటెంట్), తన ప్రిపరేషన్ ప్రాసెస్‌ను ఏమాత్రం మార్చుకోబోనని స్పష్టం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో అభిషేక్ మాట్లాడుతూ.. “నేను నా బ్యాటింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. రెండేళ్ల క్రితమే నేను ఒత్తిడి తీసుకోవడం మానేశాను. ఎందుకంటే కేవలం ప్రాసెస్ మాత్రమే నా చేతుల్లో ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. అది ప్రాక్టీస్ అయినా, ట్రైనింగ్ అయినా సరే దాన్ని నేను కచ్చితంగా చేస్తాను, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. నా ప్రాసెస్‌ను, మైండ్‌సెట్‌ను నేనెప్పటికీ మార్చుకోను” అని తేల్చి చెప్పాడు.

READ MORE: NZ vs PAK Weather Update: పాకిస్థాన్‌కు ‘వరణుడి’ షాక్.. కివీస్‌తో మ్యాచ్‌ ముందే సీన్ రివర్స్.. బాబర్ సేన సెమీస్ ఆశలు గల్లంతేనా?

ఒక బ్యాటర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని అభిషేక్ ఈ వీడియోలో వెల్లడించాడు. ఫామ్ గురించి అనవసరమైన ఒత్తిడికి గురికావడం మానేశానని స్పష్టం చేశాడు. ఇటీవల తన ప్రదర్శన గురించి ఆందోళన చెందకుండా కేవలం తన ప్రాసెస్ పైనే దృష్టి పెడతానని తెలిపాడు. “ఎలాంటి ఒత్తిడి తీసుకోకపోవడాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. బ్యాటర్‌గా ఎప్పుడూ ఎత్తుపల్లాలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బాగా పరుగులు చేస్తాం, కొన్నిసార్లు అస్సలు చేయలేం. కానీ, నేను కచ్చితంగా ఇలాగే, ఇదే ఉద్దేశంతో (ఇంటెంట్) ఆడాలని వ్యక్తిగతంగా ఒక దశలో నిర్ణయించుకున్నాను. ఇది అన్ని సందర్భాల్లోనూ నాకు సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ నా ఇంటెంట్ లేదా ప్రాసెస్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోబోను” అని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిషేక్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరి కొందరు మత్రం ఇక ముందు మ్యాచుల్లో అభిషేక్‌ను పక్కన పెట్టడమే మంచిదని సలహా ఇస్తున్నారు.

Exit mobile version