Abhishek Sharma: “నా స్టైలే ఇంత.. మైండ్‌సెట్ మార్చుకోను!” హ్యాట్రిక్ డకౌట్‌లపై అభిషేక్ శర్మ షాకింగ్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూయిస్తాడని నమ్మకం. ఓపెనర్‌గా రంగంలోకి దిగి బౌలర్లకు చుక్కలు చూయిస్తాడు. అయితే.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మూడు మ్యాచుల్లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు అభిషేక్.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న భారత్ తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్‌కు ముందు తన ఆటతీరుపై అభిషేక్ స్పందించాడు. గత మూడు ఇన్నింగ్స్‌లలో తాను ఎలాంటి పరుగులు చేయకపోయినా సరే, తన ఆడే విధానాన్ని (ఇంటెంట్), తన ప్రిపరేషన్ ప్రాసెస్‌ను ఏమాత్రం మార్చుకోబోనని స్పష్టం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో అభిషేక్ మాట్లాడుతూ.. “నేను నా బ్యాటింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. రెండేళ్ల క్రితమే నేను ఒత్తిడి తీసుకోవడం మానేశాను. ఎందుకంటే కేవలం ప్రాసెస్ మాత్రమే నా చేతుల్లో ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. అది ప్రాక్టీస్ అయినా, ట్రైనింగ్ అయినా సరే దాన్ని నేను కచ్చితంగా చేస్తాను, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. నా ప్రాసెస్‌ను, మైండ్‌సెట్‌ను నేనెప్పటికీ మార్చుకోను” అని తేల్చి చెప్పాడు.
Also Read
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
ఒక బ్యాటర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని అభిషేక్ ఈ వీడియోలో వెల్లడించాడు. ఫామ్ గురించి అనవసరమైన ఒత్తిడికి గురికావడం మానేశానని స్పష్టం చేశాడు. ఇటీవల తన ప్రదర్శన గురించి ఆందోళన చెందకుండా కేవలం తన ప్రాసెస్ పైనే దృష్టి పెడతానని తెలిపాడు. “ఎలాంటి ఒత్తిడి తీసుకోకపోవడాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. బ్యాటర్‌గా ఎప్పుడూ ఎత్తుపల్లాలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బాగా పరుగులు చేస్తాం, కొన్నిసార్లు అస్సలు చేయలేం. కానీ, నేను కచ్చితంగా ఇలాగే, ఇదే ఉద్దేశంతో (ఇంటెంట్) ఆడాలని వ్యక్తిగతంగా ఒక దశలో నిర్ణయించుకున్నాను. ఇది అన్ని సందర్భాల్లోనూ నాకు సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ నా ఇంటెంట్ లేదా ప్రాసెస్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోబోను” అని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిషేక్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరి కొందరు మత్రం ఇక ముందు మ్యాచుల్లో అభిషేక్‌ను పక్కన పెట్టడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
“I won’t ever change my process and mindset.” 📈#AbhishekSharma ‘BELIEVES’ in himself as India march into the Super 8 vs #SouthAfrica. 💪
Predict his score against South Africa in the comments.🧐
ICC Men’s #T20WorldCup SUPER 8 👉 #INDvSA | SUN, 22 FEB, 6 PM pic.twitter.com/kgNbhfsWC1
— Star Sports (@StarSportsIndia) February 21, 2026
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!