Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Catch Controversy: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్ కారణంగా మ్యాచ్‌లో డ్రామా చోటు చేసుకుంది.. ఈ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. బ్లెస్సింగ్ ముజారాబాని వేసిన బంతిని అభిషేక్ శర్మ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, టైమింగ్ కుదరక బంతి డీప్ స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి వేగంగా స్పందించి నేలకు అతి దగ్గరగా ఉన్న బంతిని అందుకున్నాడు.
Read Also: Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
మైదానంలో ఉన్న ఆటగాళ్లు క్యాచ్ క్లీన్‌గా పట్టినట్లు సంబరాలు చేసుకున్నారు. అయితే, అభిషేక్ శర్మ మాత్రం ఆ నిర్ణయంపై సందేహం వ్యక్తం చేశాడు. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ నితిన్ మీనన్‌కు పంపించారు. రీప్లేలు పరిశీలించినప్పుడు మొదట క్యాచ్ క్లీన్‌గా కనిపించినా, జూమ్‌లో చూసినప్పుడు బంతి నేలను తాకి పైకి ఎగిరినట్లు అనుమానం కలిగింది. దీంతో నిర్ణయం క్లిష్టంగా మారింది. అయినప్పటికీ ఫీల్డర్ వేళ్లు బంతి కింద ఉన్నాయని భావించిన థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, అభిషేక్ శర్మను ఔట్‌గా ప్రకటించారు.
ఈ నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోచ్ డేనియల్ వెట్టోరి కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేసి అర్ధశతకం దగ్గరలో ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. ఈ కీలక వికెట్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో తిరిగి ఆధిపత్యం సాధించింది. అయితే ఈ క్యాచ్‌పై వివాదం మాత్రం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.
తాజావార్తలు
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!