Abhishek Sharma: రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!
- ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
- సిక్సర్ల మోత మోగించిన అభిషేక్ శర్మ
- కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/23), అక్షర్ పటేల్ (2/22) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (79; 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల మోత మోగించాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాంతో టీ20ల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2018లో మాంచెస్టర్‌లో జరిగిన టీ20లో రాహుల్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యూవీ 12 బంతుల్లో ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడంతో యువరాజ్ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
Also Read: Abhishek Sharma: ఆ ఇద్దరి కోసమే అలా చేశా.. అసలు విషయం చెప్పేసిన అభిషేక్ శర్మ!
తొలి టీ20లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (97) పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (96 వికెట్లు) పేరిట ఉండేది. 79 ఇన్నింగ్స్‌లలో చహల్ 96 వికెట్లు వికెట్స్ పడగొడితే.. అర్ష్‌దీప్ 61 ఇన్నింగ్స్‌ల్లోనే అతడిని అధిగమించాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా( 91 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (90), జస్ప్రీత్ బుమ్రా (89) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..