Site icon NTV Telugu

అయ్య బాబోయ్.. Abhishek Sharma తక్కువేమి కాదుగా.. ‘ప్రీమియం బౌలర్’ అంటూ ఇచ్చిపడేశాడుగా..

Abishek Sharma

Abishek Sharma

Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 ఎలాంటి విద్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయం తర్వాత తన దూకుడు విధానాన్ని అతను సమర్థించుకున్నాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన అభిషేక్ శర్మ బౌలర్ ఎటువంటి వారైనా తన ఆటతీరులో మార్పు ఉండదని చెప్పాడు.

Tollywood: సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు

ఇక ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టి అభిషేక్ శర్మ హాట్ టాపిక్ గా నిలిచాడు. అంతేకాదు షాహీన్‌తో మాటల యుద్ధం కూడా జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్ తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్న తర్వాత అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని.. అది స్పిన్నర్లు అయినా, పేసర్లు అయినా తన విధానం మారదని చెప్పాడు. “పవర్‌ప్లేలో నాకు ఏ బౌలర్ వచ్చినా, నేను మొదటి బంతి నుంచే వారిపై దాడి చేయాలనుకుంటాను. అది స్పిన్నర్, బౌలర్, ప్రీమియం బౌలర్ అయిన సరే అని నవ్వాడు. అయితే ఇక్కడ ‘షాహీన్ అఫ్రిది’ లాంటి ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ అయినా సరే అని అర్థమయ్యేలా.. షాహీన్‌ను పరోక్షంగా విమర్శించాడు. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్‌లో ఏడు మ్యాచ్‌లలో 314 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.

Accenture Layoffs: అసలేం జరుగుతోంది.. మూడు నెలల్లో 11,000 ఉద్యోగులను తొలగింపు.. త్వరలో మరికొందరు కూడా?

ఆసియా కప్ ఫైనల్‌లో అభిషేక్ శర్మ కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే, అతడి వైఫల్యం జట్టుపై ప్రభావం చూపలేదు. తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో జట్టును విజయపథంలో నడిపించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి తమ తొమ్మిదో సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.

Exit mobile version