Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!

Abhishek Sharma Record

Abhishek Sharma Record

Abhishek Sharma: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్ టీమ్‌కి మొగుడిలా మారాడు. ఇక, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు.

వైభవ్ 9 బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. వైభవ్ అవుటయ్యే సమయానికి స్కోరు 28/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో సంజు సామ్సన్ కూడా నిరాశపరిచాడు, అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులకే అవుటయ్యాడు. అప్పటి నుంచి కాటేరమ్మ కొడుకు టీమిండియా బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. ఈ ఫార్మాట్‌లో 13వ అర్ధశతకం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, 61 పరుగుల వద్ద అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. తన ఇన్నింగ్స్‌లో 28 బంతులు ఆడిన అభిషేక్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 217గా నమోదైంది. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్ అతడిని స్టంప్ చేయడంతో అభి పెవిలియన్‌కు చేరాడు.