Abhishek Nayar: కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్.. ఐపీఎల్ 2026 కేకేఆర్ తలరాత మారేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Nayar: ఐపీఎల్ 2026 సీజన్‌కు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ముఖ్యమైన వార్త వచ్చింది. ఈ జట్టు తన కోచింగ్ సెటప్‌లో భారీ మార్పులు చేసింది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించింది. గతంలో ఈ టీంకు చంద్రకాంత్ పండిట్ ప్రధాన కోచ్‌గా సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్తగా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు.
READ ALSO: Top Headlines @5PM : టాప్ న్యూస్
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
ముగిసిన చంద్రకాంత్ పండిట్ పదవీకాలం..
కేకేఆర్ జట్టుతో హెడ్ కోచ్‌గా మూడేళ్లు ఉన్న చంద్రకాంత్ పండిట్ ఇప్పుడు టీంతో విడిపోయారు. పండిట్ పదవీకాలంలో KKR పదేళ్ల తర్వాత 2024లో IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఇది ఆయన కోచింగ్ కెరీర్లో ఒక పెద్ద విజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 2025 సీజన్ జట్టుకు పెద్ద నిరాశను మిగుల్చింది. అజింక్య రహానే కెప్టెన్సీలో KKR పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ పేలవమైన ప్రదర్శన తర్వాత, జట్టు యాజమాన్యం టీంలో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది.
కేకేఆర్ గూటికి అభిషేక్ నాయర్ ..
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అభిషేక్ నాయర్ హెడ్ కోచ్‌గా తిరిగి వచ్చాడు. ఆయన గతంలో ఫ్రాంచైజీకి అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అలాగే ఆయన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో UP వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు. అక్కడ ఆయన కొత్త ప్రతిభను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున అభిషేక్ నాయర్ మూడు వన్డేలు ఆడాడు. కానీ ఆయన నిజమైన ప్రతిభ కోచ్, మెంటర్‌గా వ్యవహరించిన సందర్భంలో వెలుగులోకి వచ్చింది. ముంబై క్రికెట్లో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. దినేష్ కార్తీక్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాతో సహా అనేక మంది భారతీయ ఆటగాళ్ల కెరీర్లపై ఆయన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపారు.
రాబోయే నవంబర్ 2025 నెలలో BCCI అన్ని ఫ్రాంచైజీలను వారి రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను అడుగుతుంది. అభిషేక్ నాయర్ నియామకం తర్వాత, ఆయన మొదటి బాధ్యత ఏ ఆటగాళ్లను రిటైన్ చేయాలి, ఎవరిని వేలానికి విడుదల చేయాలి అని నిర్ణయించడం అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. నాయర్ నాయకత్వంలో KKR జట్టు తలరాత ఎంత వరకు మారబోతుందో వేచి చూడాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Yuvraj Singh: ఐపీఎల్లో చీఫ్ కోచ్‌గా మారబోతున్న యువరాజ్ సింగ్ .. ఏ జట్టుకో తెలుసా!
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!