Abdul Rehman Makki: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) సోమవారం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్‌ఐఎల్ (దాయెష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా జాబితా చేసింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. జూన్ 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1267 కమిటీ అని కూడా పిలువబడే ఆంక్షల కమిటీ కింద టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జాబితా చేయాలనే ప్రతిపాదనను నిరోధించిన తర్వాత భారతదేశం చైనాను నిందించింది.
Man Fakes Kidnapping: లవర్‌తో గడిపేందుకు కిడ్నాప్ స్కెచ్.. భార్య ఎంట్రీతో బట్టబయలు..
లష్కరే తోయిబా చీఫ్, ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ బావ అయిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఎల్‌ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో కూడా మక్కీ కీలక పాత్ర పోషించారు.ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింప చేయడంతో పాటు ప్రయాణ నిషేధం విధించారు. గ్లోబల్ టెర్రరిస్టు అయిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీ జమ్మూకశ్మీరులో ఉగ్ర దాడులకు నిధులను సేకరించడంతోపాటు యువతను ఉగ్రదళాల్లోకి రిక్రూట్ మెంట్ చేశాడని వెల్లడైంది. 2020వ సంవత్సరంలో పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో జైలు శిక్ష విధించింది. గతంలో, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి తెలిసిన టెర్రరిస్టుల జాబితాకు చైనా అడ్డంకులు పెట్టింది. పాకిస్తాన్ ఆధారిత యూఎన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్ని ప్రతిపాదనలను అది పదేపదే అడ్డుకుంది.