NTV Telugu Site icon

Kantara Star Rishabh Shetty: ‘కాంతార’ స్టార్‌ను కలిసిన మిస్టర్‌ 360

Rishab Shetty

Rishab Shetty

Kantara Star Rishabh Shetty: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కాంతార’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కన్నడలో ఆధ్యాత్మిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను కేజీఎఫ్‌ మూవీని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించడం గమనార్హం. రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఇతర భాషల్లోకి కూడా అనువదించి విడుదల చేశారు. ఇక తెలుగు, హిందీ భాషల్లో కూడా సినీ అభిమానులు ఈ సినిమాకు జేజేలు పలుకుతున్నారు.

కాగా దేశవ్యాప్తంగా కాంతార చిత్రం ప్రమోషన్స్‌ చేసే పనిలో నిమగ్నమైన రిషబ్‌ శెట్టిని దక్షిణాఫ్రికా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఏబీ డివిలియర్స్‌ కలిశాడు. రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏబీ డివిలియర్స్‌తో ఉన్న ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోలో డివిలియర్స్‌, రిషబ్ శెట్టితో కలిసి కాంతారా అని చెబుతున్నట్లు కనిపించింది. రిషబ్‌ షేర్‌ చేసుకున్న ఈ వీడియోకు క్యాప్షన్‌ ఈ విధంగా ఇచ్చారు. “ఇది ఒక మ్యాచ్. ఈ రోజు మిస్టర్ 360ని కలుసుకున్నాను. సూపర్‌హీరో మళ్లీ బెంగుళూరుకు తిరిగి వచ్చాడు” అని రిషబ్ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు.అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌ ఇప్పుడు ఈ కాంతారా ప్రమోషనల్ వీడియోలో కనిపించేసరికి, అభిమానులు వీడియోని షేర్లు చేస్తూ వారి అభిమానాన్ని తెలుపుతున్నారు. ‘ఇద్దరు స్టార్లు కలిశారు’ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Yashoda: సమంత అనారోగ్యం గురించి నాకప్పుడు తెలియదు: ఉన్ని ముకుందన్

కాంతార సినిమా కన్నడ, హిందీ వెర్షన్‌లలో వరుసగా సెప్టెంబర్ 30న, అక్టోబర్ 14న విడుదలైంది. చిత్రానికి రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్.జి కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష కూడా ఇచ్చారు. సినిమాను బాగా రూపొందించారని ఆమె ప్రశంసించారు. ‘కాంతారా’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.