Aaron Finch: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆరోన్ ఫించ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 2020లో ఆస్ట్రేలియా జట్టు తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఎంసీజీ మైదానంలో వెల్లడించాడు.
Also Read: Shehbaz Sharif: భారత్‌కి పాక్ ప్రధాని బెదిరింపు.. పాదాల కింద నలిపేస్తాడట!
Also Read
“నేను 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడలేనని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో రిటైర్ అవడం కంటే ఇప్పుడే రిటైరవ్వడం సరైన సమయమని భావించాను. తద్వారా జట్టుకు భవిష్యత్ నాయకుడిని తయారు చేసుకోవడానికి సమయం లభిస్తుంది. నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు, సహచరులకు, సహాయ సిబ్బందికి, నా కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. 2020లో టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్ గెలవడం నా కెరీర్లో మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి” అని ఫించ్ పేర్కొన్నాడు.
ఫించ్ కెరీర్లో మొత్తం 146 వన్డేల్లో 5,406 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. 103 టీ20లు ఆడి 2 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు సహా 3,120 పరుగులు సాధించాడు. 5 టెస్టు మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు. తన కెప్టెన్సీలో టీ20ల్లో జట్టుకు ప్రపంచకప్‌ను అందించాడు. 2015 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఫించ్ కీలకపాత్ర పోషించాడు. మరో నాలుగు రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ కోసం ఇప్పటికే అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండుసార్లూ ఓడిపోయిన ఆసీస్ ఈ సారి ఎలాగైనా ఇండియాను దెబ్బతీయాలని ఎదురుచూస్తోంది.
Also Read: Human Sacrifice in Chennai: కన్యాకుమారిలో ఘోరం.. చిన్నారి నరబలికి ప్రయత్నం
తాజావార్తలు
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!