తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ క్రమంలో.. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ లోతేటి చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు. దీంతో.. రేపు యథావిధిగా సర్వీసులు కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటళ్లకు రూ.1130 కోట్లు చెల్లించింది సర్కార్. సుమారు రూ.730 కోట్లు బకాయి పెట్టి పోయింది గత సర్కార్. వాటన్నింటినీ ప్రజాప్రభుత్వం చెల్లించింది. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల రేట్లను రివైజ్ చేసినట్టు సీఈవో గుర్తు చేసింది. ప్యాకేజీల ధరలను సగటున 22 శాతం పెంచింది ప్రజా ప్రభుత్వం.
Read Also: Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు పొందండి!
కాగా.. బుధవారం (నిన్న )రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఈనెల 10వ తేదీ నుంచి నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు హెచ్చరించాయి. ఈమేరకు ఆరోగ్యశ్రీ సీఇవోకు ఈ-మెయిల్స్ పంపించాయి. ఏడాది కాలంగా తమకు బకాయిలు చెల్లించడం లేదని, ఈనెల 10లోగా తమ పెండింగ్ బకాయిల అంశాన్ని పరిష్కరించాలని, లేకుంటే అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేశాయి. ఆరోగ్యశ్రీతో పాటుగా.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS), జర్నలిస్టు హెల్త్ స్కీమ్ (JHS)లలో కూడా భారీగా బకాయిలు ఉన్నాయన్నారు. పెండింగ్ బకాయిల వల్ల ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆసోసియేషన్ తెలిపింది.
Read Also: Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు పొందండి!