Site icon NTV Telugu

Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.

Aradhya Bachan

Aradhya Bachan

నేటి కాలంలో ఏడాది నిండని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడిపోతున్నారు. ఇక స్కూల్ పిల్లలకైతే ఫోన్ నిత్యావసరంగా మారింది. సామాన్యుల ఇంట్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఐఫోన్లు, టాబ్‌లు అంటూ లగ్జరీ గ్యాడ్జెట్స్‌తో కాలం గడిపేస్తుంటారు. కానీ, బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ కుమార్తె ఆరాధ్య విషయంలో మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన కుమార్తె మొబైల్ ఫోన్ వాడకం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : Vishwambhara : ‘విశ్వంభర’‌పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు..

ఆరాధ్యకు ప్రస్తుతం 14 ఏళ్లు వచ్చినప్పటికీ, ఆమెకు ఇప్పటికీ సొంతంగా మొబైల్ ఫోన్ లేదని ఆయన వెల్లడించారు. నేటి కాలంలో చిన్న పిల్లలకే స్మార్ట్ ఫోన్లు ఉంటున్న తరుణంలో, స్టార్ కిడ్ అయి ఉండి కూడా ఆరాధ్యకు ఫోన్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నిబంధన వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, ఇది తాము చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని అభిషేక్ తెలిపారు. ఒకవేళ ఆరాధ్య స్నేహితులు ఎవరైనా ఆమెతో మాట్లాడాలని అనుకుంటే, వారు నేరుగా తన తల్లి (ఐశ్వర్య రాయ్) ఫోన్‌కే కాల్ చేయాల్సి ఉంటుంది. పిల్లలను డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంచుతూ, క్రమశిక్షణతో పెంచాలనే ఉద్దేశంతోనే ఐశ్వర్య ఈ కఠినమైన రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా సాధారణ పిల్లల తరహాలోనే ఆమెను పెంచుతున్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి బచ్చన్ ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version