NTV Telugu Site icon

Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం

Parede

Parede

AAP: వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీ డ్యూటీ పాత్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం భద్రతా సిబ్బంది రిహార్సల్ ఈరోజు నుంచి ప్రారంభించారు. జనవరి 26న భద్రతా సిబ్బంది పూర్తి సన్నద్ధతతో, ఉత్సాహంతో తమ శౌర్యాన్ని ప్రదర్శించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన విద్య, ఆరోగ్య నమూనాకు సంబంధించిన శకటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రిపబ్లిక్ డే రోజున జరిగిన వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Read Also: AUS vs PAK; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో చండీగఢ్ నుంచి ఏ శకటం రావడం లేదు.. ఇప్పుడు అధికారులు 2025 కవాతు కోసం సన్నాహాలు స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం 20 రాష్ట్రాలకు చెందిన శకటాలు మాత్రమే పరేడ్ లో పాల్గొంటాయి. కానీ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇదో బలమైన ఉదాహరణ అని అన్నారు.