NTV Telugu Site icon

Aamir Khan: ఆమిర్ ఖాన్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ “మహాభారత్‌”.. పనులు ప్రారంభం..

Aamir Khan

Aamir Khan

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు. విలేకర్లు, ఫొటోగ్రాఫర్ల ఎదుట కేక్‌ కట్‌ చేసి వారికి తినిపించాడు.

READ MORE: Ponnam Prabhakar : మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

అనంతరం ఆయన తన మహాభారత్‌ గురించి సమాచారం ఇచ్చాడు. మహాభారత్‌ మీద సినిమా చేయడమంటే ఒక యజ్ఞంతో సమానం అని గతంలో కూడా ఆమిర్ ఖాన్ తెలిపాడు. ఈ ప్రాజెక్టును శ్రద్ధ, భయంతో పూర్తి చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మహాభారత్‌ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దీనిని పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పనులు ప్రారంభిస్తున్నాం. స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెడుతున్నాం. ఇందు కోసం ఒక బృందాన్ని నియమించే పనిలో పడ్డాం. చాలా అంశాల గురించి అన్వేషణ మొదలు పెట్టాం. చివరికి ఏం జరుగుతోందో వేచి చూడాలి. ’’ అని పేర్కొన్నాడు.

READ MORE: Alia Bhatt: కూతురు ఫొటోలు తొలగించడంపై ఆలియా భట్ క్లారిటీ..