Site icon NTV Telugu

Kollywood : అమీర్ ఖాన్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోలేదండోయ్

Lokesha Kanakarj Aamir Khan

Lokesha Kanakarj Aamir Khan

లోకేష్ కనకరాజ్ రీసెంట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ ప్రత్యక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ హీరోగా ఈ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖైదీ 2 తర్వాత ఆమిర్ ఖాన్ – లోకేష్ సినిమా ఉంటుందని కూడా వినిపించింది.

Also Read : BMB : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు.. టైటిల్ పోస్టర్ రిలీజ్

అయితే కూలీలో అమీర్ ఖాన్ రోల్ పట్ల భారీ నెగిటివిటి వచ్చింది. అసలు ఆ పాత్ర ఆమిర్ ఖాన్ చేసి ఉండాల్సింది కాదని అటు క్రిటిక్స్ తో పాటు ఆడియెన్స్ కూడా అదే భావం వ్యక్తం చేసారు. కానీ విక్రమ్ లో రోలెక్స్ పాత్రలో సూర్య కు వచ్చిన ఇమేజ్ తనకు వస్తుందని భావించిన అమిర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపధ్యంలో లోకేష్ కనకరాజ్ వర్క్ పట్ల ఆమిర్ ఖాన్ హ్యాపీగా లేడని కూడా ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. కానీ అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చేశాడు అమీర్. అటు లోకేష్ కూడా ఖైదీ 2 చేయాలని ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందని ఫిక్స్ అయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ తో సినిమా గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ ‘ అవును, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పైప్‌లైన్‌లో ఉంది. నేను, లోకేష్ కనగరాజ్ గత నెలలో ముంబైలో కలవాల్సి ఉంది. కథ, కథనాలపై వర్క్ జరుగుతోంది. సంవత్సరానికి ఒక సినిమా ఇవ్వాలనేది నా ఆసక్తి & భావోద్వేగం, నా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు.

Exit mobile version