NTV Telugu Site icon

Arvind Kejriwal: సెలవు తీసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించమంటున్న మాజీ సీఎం

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కొన్ని నెలల పాటు సెలవులు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను కోరారు. బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు ఢిల్లీలోని తమ పరిచయస్తులు, బంధువుల స్థలాల్లో మకాం వేసి పార్టీ కోసం పబ్లిసిటీ వర్క్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలను గెలవనివ్వకూడదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Read also: Vivo Y19s: సరసమైన ధరకు అదిరిపోయే ఫీచర్లతో గ్లోబల్ మార్కెట్‭లో ఫోన్‭ను లాంచ్ చేసిన వివో

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో చాలా కాలంగా మాట్లాడాలని అనుకుంటున్నానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మీతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. కొందరిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అత్యంత క్లిష్టమైన దశను దాటారు. దేవుడు తన ప్రియమైన శిష్యులను పరీక్షిస్తాడు. భవిష్యత్తు సవాళ్ల కోసం మనల్ని బలపరచడానికి దేవుడు కష్టాలను పంపుతాడని, దేవుడు గొప్ప కష్టాలను పంపినప్పుడు, దేవుడు మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప పని చేయబోతున్నాడనే సంకేతం అని అన్నారు.

Read also: UPSC Exam Calendar 2025: సవరించిన పరీక్ష తేదీల క్యాలెండర్ విడుదల చేసిన యూపీఎస్సీ

అందుకే కష్టాలకు భయపడకుండా ధైర్యంగా పని చేయాలని, మా పార్టీ చాలా ధైర్యంగా, విజ్ఞతతో అన్ని కష్టాలను ఎదుర్కొందని తెలిపారు. మమ్మల్ని బద్దలు కొట్టి కొనుక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అది జరగలేదని ఆయన ఎన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు దృఢంగా ఒక కుటుంబంగా మారారు. నేను కార్యకర్తలను కలిసినప్పుడు, వారి దృష్టిలో నాపై ఉన్న ప్రేమను చూసి నేను పొంగిపోయాను. మీరు నన్ను చాలా ప్రేమిస్తారని నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తానని అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలతో అన్నారు.

Show comments