Site icon NTV Telugu

Ponnavolu Sudhakar Reddy: కొలీజియం, సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తారా?

Ponnavolu

Ponnavolu

ఏపీ హైకోర్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం, సుప్రీంకోర్టుని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు సుధాకర్ రెడ్డి. సీఎంపై విమర్శలు చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. కొలీజియం న్యాయమూర్తుల నియామకం, బదిలీలు చేస్తుంది. కొలీజియంకు సొంత ఇంటలిజెన్సీ వుంటుంది. కొలీజియంను, సుప్రీంకోర్టును ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు . న్యాయవాదులు బాయ్ కాట్ చేయకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.

Read ALso: Radhika Sharathkumar: దేవుడా.. సూపర్ స్టార్ ను పట్టుకొని అంత మాట అనేసిందేంటి..?

రాజ్యాంగబద్దమైన కోర్టులకు రాజకీయంలు అంటగట్టవద్దు. న్యాయ వ్యవస్థను మీ రాజకీయాలకోసం వాడుకోవద్దు. దండంపెట్టి చెబుతున్నా జడ్జిలను రాజకీయాల్లోకి తేవద్దు. జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం సహజమే. అలాగని వారిపై ఫిర్యాదులు చేస్తారా?

జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రమేష్ లపై ప్రభుత్వం సుప్రీంకోర్టు, కొలీజియంలకు ఫిర్యాదులు చేసినట్లు నాకు తెలియదు. స్థాయి లేని వ్యక్తులు సిఎంను విమర్శించడం ఫ్యాషన్ అయ్యింది. సిఎం వచ్చి వారికి సమాధానం చెప్పరు. కొలీజియం అనేది ఇండిపెండెంట్ .కొలీజియం, సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేయడమంటే దాడి చేయడమే.ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోషియేషన్ విధులను బహిష్కరించాలని ప్రకటించలేదన్నారు సుధాకర్ రెడ్డి.

Read Also: Anil Kumar Yadav Controversy: వివాదంలో మాజీ మంత్రి అనిల్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు

Exit mobile version