Aadujeevitham Streaming on Netflix Now: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వేసవి కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూశారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆడు జీవితం స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఎట్టకేలకు ఓటీటీలోకి ఆడు జీవితం రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన మహారాజ చిత్రం ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే.
Also Read: Gautam Gambhir Trolls: కోల్‌కతాపై ప్రేమ.. చెన్నైపై ద్వేషం!
కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ ఆడు జీవితం. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెబుతూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ నవలను రచించారు. 2008లో ఈ నవల అత్యధికంగా అమ్ముడైంది. గోట్ డేస్‌ను సినిమాగా తీయాలనే ఆలోచనతో డైరెక్టర్ బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. 10 ఏళ్లకు పైగా శ్రమించి.. ఆడు జీవితంను తెరకెక్కించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ బ్లెస్సీ, హీరో పృథ్వీరాజ్ కష్టానికి తగిన ఫలితం దక్కింది.