NTV Telugu Site icon

UIDAI: విదేశీయులు కూడా ఆధార్ కార్డు పొందవచ్చు.. కానీ..

Aadhaar

Aadhaar

ఆధార్​ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కలకత్తా హైకోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ పొందవచ్చని యుఐడీఏఐ (UIDAI) పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివగణం, జస్టిస్‌ హిరణ్‌మోయ్‌ భట్టాచార్యలతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ముందు ఈ వాదనలు జరిగాయి. పౌరసత్వంతో దానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దేశంలో ఓ వ్యక్తి నివాస ప్రాంతాన్ని ధ్రువీకరించేది మాత్రమేనని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో అనేక ఆధార్ కార్డులను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం, తిరిగి యాక్టివేట్ చేయడాన్ని సవాలు చేస్తూ..వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి.

READ MORE: Brain-Eating Amoeba: ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ .. కేరళలో 4వ కేసు నమోదు..

ఆధార్ నిబంధనలలోని 28 ఏ(A), 29 నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ తరఫు న్యాయవాది జుమా సేన్ సవాలు చేశారు. ‘ఆధార్ చాలా పెద్ద విషయం. పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆధార్ అవసరం. జనన ధృవీకరణ పత్రం ఆధార్ తప్పనిసరి. కాబట్టి ఆధార్ లేకుండా ఒక వ్యక్తి చనిపోలేడు. జననం నుంచి మరణం వరకు అన్నీ ఆధార్ తో ముడిపడి ఉన్నాయి.” అని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

READ MORE: Vizag: కిడ్నీ రాకెట్ కేసులో మాకేమీ సంబంధం లేదు: క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్

యుఐడీఏఐ సీనియర్ న్యాయవాది లక్ష్మీ గుప్తా పిటిషనర్ల హక్కులను సవాలు చేస్తూ తన వాదనలు వినిపించారు. తమను ‘అన్‌ రిజిస్టర్డ్‌ ఆర్గనైజేషన్‌’ అని.. అలాంటి వాదనను అంగీకరించబోమని చెప్పారు. ఆధార్ కార్డులకు పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు విదేశీ పౌరులకు నిర్ణీత సమయం వరకు ఇవ్వవచ్చని తెలిపారు. ఈ వాదన దేశీయ పౌరులు కానివారికి, చాలా వరకు బంగ్లాదేశ్ పౌరులకు అనుకూలంగా ఉన్నందున ఇది ఆమోదయోగ్యం కాదని కూడా వాధించారు. వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఎక్కువ కాలం ఉంటున్న విదేశీయుల ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే అధికారం UIDAIకి ఉందని గుప్తా వివరించారు.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ కుమార్ చక్రవర్తి వాదనలు వినిపించారు. ఆధార్ చట్టంలోని సెక్షన్ 54ను సవాల్ చేయనందున పిటిషనర్ల ఈ వాదనను అంగీకరించబోమని కేసు విచారణ తేదీని పొడిగించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయలేరని పిటిషన్‌ను కొనసాగించడం సాధ్యం కాదని సమర్పించారు.