NTV Telugu Site icon

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో హిందూ మతాన్ని స్వీకరించిన ముస్లిం యువకుడు

Mp Young Man

Mp Young Man

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం యువకుడు హిందూ మతాన్ని స్వీకరించాడు. అనంతరం ఫాజిల్ ఖాన్​ గా ఉన్న తన పేరును అమన్ రాయ్​ గా మార్చుకున్నాడు. మతం మారిన తర్వాత తన ప్రేయసి సోనాలిని వివాహం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని ర్సింగ్పుర్.. కరోలికి చెందిన అమన్ రాయ్.. సోనాలి గత ఐదు సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి ముందు ఫాజిల్ ఖాన్.. వేద మంత్రాల సాక్షిగా రామచరిత మానస్ చేతిలో పట్టుకుని హిందూ మతాన్ని స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి హిందూ సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

Also Read: IT Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్‌.. ఈనెల 22న విచారణకు రావల్సిందే..!

ఫాజిల్ ఖాన్ మతం మారిన తర్వాత శ్రేయాభిలాషుల సమక్షంలో తన లవర్ సోనాలిని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. అయితే లవ్ మ్యారేజ్ కి శ్రీరాముని టెంపుల్ వేదికైంది. సోనాలి నుదిట కుంకుమ బొట్టును పెట్టి భార్యగా అమన్ రాయ్ స్వీకరించాడు. తన ప్రేయసి సోనాలిని వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అమన్​ రాయ్ చెప్పుకొచ్చాడు.

Also Read: One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం పోతే.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

తనకు చిన్నప్పటి నుంచి హిందూ మతం పట్ల గౌరవం ఉందని అమన్​ రాయ్ తెలిపారు. తన తండ్రి హిందువు అయినప్పటికీ పెళ్లైన తర్వాత ఇస్లాంలోకి మారాడని చెప్పాడు. తన తల్లి ముస్లిం కావడం వల్లే ఇలా జరిగిందన్నాడు. తన స్నేహితుల్లో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు.. వారందరూ తన పట్ల అభిమానం చూపిస్తారని అమన్ రాయ్ పేర్కొన్నాడు. దేవాలయాలను సందర్శించడం తనకు చాలా ఇష్టం.. చిన్నప్పటి నుంచి హిందు దేవుళ్లకు పూజలు చేస్తున్నానని అతడు అన్నాడు.