జనగామ జిల్లా లింగాలగణపురం మండలం చీటూరు గ్రామానికి చెందిన వాతల రీన పాలకుర్తి మండలం శాతాపురం తండాకు చెందిన లాకవత్ మోహన్ ( వినోద్) లు జనగామలో డిగ్రీ చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాక పెళ్లి కూడా చేసుకుంటానని అమ్మాయికి హామీ ఇచ్చి శారీరకంగా కూడా లొంగదీసుకున్నాడు. గత మూడు నెలల క్రితం అమ్మాయికి గర్భవతిగా నిర్ధారణ కావడంతో అమ్మాయిని మానసికంగా వేధించిన మోహన్( వినోద్) అబార్షన్ కూడా చేయించాడు. ఆ తర్వాత మోహన్ ను సదరు యువతి రీనా నిలదీయడంతో 20 రోజు తర్వాత మాదాపురం గుట్ట వద్ద పెళ్లి చేసుకుందామని నమ్మించి తన స్వగృహమైన శాతాపురం తండకు మోహన్ వచ్చాడు. అమ్మాయికి తెలియకుండా మరో అమ్మాయిని గత రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు.
Also Read : Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది
అమ్మాయి రీన ఫోన్ చేస్తున్న కూడా మోహన్ లిఫ్ట్ చేయకపోవడంతో పాటు ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టాడు. మరో ఫోన్ నుంచి అమ్మాయి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ తన ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టావు అనగా తనకు మరో అమ్మాయితో పెళ్లి అయిందని పెళ్లి ఫోటోను వాట్సాప్ లో పోస్ట్ చేశాడు. హైదరాబాద్ లోని మియాపూర్ లో పనిచేస్తున్న రీనా హుటాహుటిన శాతాపురంలోని తండాలో యువకుని ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు అక్క బావలు కలిసి ఫోన్ లాక్కొని తీవ్రంగా కొట్టారు. దీంతో సదరు యువతి పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తనను ప్రేమించి మోసం చేశాడని శారీరకంగా వాడుకున్నాడని తనను కూడా పెళ్లి చేసుకోవాలని అమ్మాయి రీన డిమాండ్ చేస్తుంది. తనకు పోలీసులే తగిన న్యాయం చేయాలని వేడుకుంది.
Also Read : Anantapur SP: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవు