Site icon NTV Telugu

Haryana: ముందు నువ్వు చస్తావా.. నేను చావనా.. పందెం వేసుకున్న తాగుబోతులు.. సీన్ కట్ చేస్తే

Train

Train

Haryana: చుక్క పడిందో చుక్కల్లో తేలినట్టుంటది.. ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి. ఒంటి సోయి మర్చిపోయి ప్రాణాలపైకి తెచ్చుకుంటారు మందుబాబులు. మందు ఎంతటి పనైనా చేయిస్తుంది.భయం పొగొడుతుంది. ధైర్యం లేని వాళ్లకు తెప్పిస్తుంది. బలహీనుల్ని బలవంతులను చేస్తుంది. అందుకే ఏ పోరుకైనా ఎంతటి రిస్క్ చేయడానికైనా తాగుబోతులు తొడగొడతారు.. కానీ అదే బెడిసికొడితే.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. హర్యానాలోని సోనేపట్‌లోని జట్వారా గ్రామానికి చెందిన ముఖేష్, అతడి స్నేహితుడు మను ఇద్దరూ దుప్పట్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Read Also: Bandi Sanjay: భార్య పిల్లను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా

బుధవారం ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ముఖేష్ సోదరి ఇంట్లో భోజనం చేశారు. బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరూ పందెం కాశారు. ఎవరు ముందుగా చనిపోతారు అనేది పందెం యొక్క సారాంశం. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. రైలు వస్తుండగా మద్యం మత్తులో ఉన్న మను.. పందెం ప్రకారం ముఖేష్‌ను రైలు ముందుకి తోశాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తు దిగిన మను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: WITNESS: మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ‘విట్ నెస్’!

సోనేపట్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో ముఖేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటన సమయంలో జట్వాడ గ్రామానికి చెందిన కుల్‌దీప్‌, దీపక్‌లు అక్కడే ఉన్నారని జీఆర్‌పీ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ధర్మపాల్‌ తెలిపారు. ముఖేష్, మను ఇద్దరూ మత్తులో ఎవరు ముందుగా చనిపోతారో చూడాలని పందెం వేశారని వారు పోలీసులకు తెలిపారు. అయితే మను ముఖేష్‌ను రైలు ముందుకు నెట్టడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Exit mobile version