తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు జలపాతాలు కూడా జలకళను సంతరించుకోవడంతో.. ప్రకృతి ప్రేమికులు జలపాతం అందాలను చూడటం కోసమని క్యూ కడుతున్నారు. అయితే వర్షం ఆగకుండ కొడుతుండటంతో.. జారి పడే అవకాశాలు చాలా ఉన్నాయి. దీంతో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలువురు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చి.. అనంతలోకాలకు వెళ్లాడు.
Mehreen Pirzadaa: ఉర్ఫీ జావేద్‌లా తయారైన మెహ్రీన్.. ఇదేం డ్రెస్సురా బాబూ?
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం సబితం జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి జలపాతం సందర్శనకు వచ్చారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. వెంటనే మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.