Site icon NTV Telugu

Nellore Crime: నెల్లూరులో దారుణం.. పెళ్లికి నిరాకరించిన యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి

Nellore Crime

Nellore Crime

Nellore Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. పెళ్లికి నిరాకరించిన ఓ యువతిపై దాడి చేసిన యువకుడు.. అడ్డుకునేందుకు యత్నించిన యువతి తల్లిపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.. అయితే, బాధితులు కేకలతో స్థానికులు అప్రమత్తం కావడంతో.. ఘటనా స్థలం నుంచి పారిపోయాడు నిందితుడు నాగార్జున

Read Also: Nirmala Sitharaman: స్వాతి మలివాల్‌ కేసుపై కేజ్రీవాల్ స్పందించకపోవడం సిగ్గుచేటు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరు యాదవ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. వింజమూరు గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు యాదవ పాలెంలో ఉంటున్న ఓ యువతి వెంట పడుతున్నారు.. తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తూ.. చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు. ఇరువురికీ బంధుత్వం ఉండటంతో యువకుడిని వివాహం చేసుకునేందుకు సదరు యువతి నిరాకరించింది. అయినా వెనక్కి తగ్గని యువకుడు.. పలుమార్లు వెంటపడుతూనే ఉన్నాడు.. ఆమె స్పందించలేదు. దానికి తోడు ఆ యువతికి వేరే సంబంధాలు చూస్తుండటంతో తీవ్రంగా ఆగ్రహించిన నాగార్జున… ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమె పై కత్తితో దాడి చేశాడు. కూతురిని జరుగుతోన్న దాడిని గమనించిన తల్లి.. తన కూతురును కాపాడేందుకు ప్రయత్నించింది.. దీంతో.. ఆ యువతి తల్లిపై కూడా దాడి చేయడంతో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి రావడంతో నాగార్జున పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ.. కూతుళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు నాగార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version