Anakapalli: మైనర్ బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి.. బాలిక మృతి

  • అనకాపల్లి జిల్లాలో దారుణ హత్య
  • మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు
  • బాలిక అక్కడికక్కడే మృతి
  • కత్తితో దాడి చేసి యువకుడు పరారీ
  • కొప్పు గుండు పాలెంలో 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని
  • బాలికపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి.
Anakapalli

Anakapalli

అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం లోచోటుచేస్తుంది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని(14) బాలికపై సురేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. సంఘటన స్థలంలోనే నిందితుడు కత్తి వదిలేసి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.