NTV Telugu Site icon

Tamanna Dead Body : లంచ్‎కు రమ్మన్నారు.. తమన్నాను చంపి డ్రమ్ములో పెట్టారు

Tamanna

Tamanna

Tamanna Dead Body : కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్రమ్ములో మహిళ మృతదేహం లభ్యం కావడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల పేర్లు కమల్, తన్వీర్, సాకిబ్. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి పేరు తమన్నా.

Read Also: World Sleep Day : అతిగా నిద్ర పోతే.. మీరు ఉబ్బిపోతారు జాగ్రత్త

తమన్నా తన మొదటి భర్త అఫ్రోజ్‌తో తరచూ గొడవలయ్యేవి. వాటితో విసిగిపోయిన ఆమె అఫ్రోజ్‌కు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత, ఆమె అఫ్రోజ్ బంధువు ఇంతిఖాబ్‌ను వివాహం చేసుకుంది. దీంతో ఇంతిఖాబ్‌తో, కుటుంబ సోదరులతో విభేదాలు వచ్చాయి. ఇంతిఖాబ్ నవాబు బెంగళూరులో పనిచేస్తున్నాడు. మార్చి 12న కల్సిపాళ్యలోని తన ఇంట్లో తమన్నా, ఇంతాఖాబ్‌లను డిన్నర్‌కి పిలిచాడు. దాని ప్రకారం ఇద్దరూ భోజనానికి వెళ్లారు. భోజనం చేశాక గొడవ పడ్డారు. నిందితుడు నవాబ్ ఇంతాఖాబ్‌ను ఇంటి నుండి బయటకు రమ్మని కోరాడు. తమన్నాను తిరిగి బీహార్‌కు పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో 8 మంది ఉండడంతో నిస్సహాయుడైన ఇంతఖాబ్ తన భార్యను వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత నిందితులు తమన్నాను దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో వేసి బీహార్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారు.

Read Also: Pot Water Benefits: మట్టికుండలోని నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా?

ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రమ్ములో నిందితులు మహిళ మృతదేహాన్ని ఉంచారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకున్నారు. వీరంతా బీహార్‌కు చెందిన వారు కాగా, మరో ఐదుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

Show comments