NTV Telugu Site icon

FACT CHECK: “మద్యం తాగి రాజ్యాంగం రాశారు”.. కేజ్రీవాల్ వీడియో వైరల్

Fact Check

Fact Check

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యాంగం, బాబా సాహెబ్ అంబేడ్కర్, రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు పరస్పరం దళిత వ్యతిరేకులుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో ‘రాజ్యాంగం ఎవరు రాశారో వారు మద్యం తాగి రాసి ఉంటారు’ అనే కేజ్రీవాల్ చెప్పినట్లు ఉంది.

READ MORE: Vinod Kambli: మళ్లీ క్షీణించిన మాజీ క్రికెటర్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స

గత కొద్ది రోజులుగా అరవింద్ కేజ్రీవాల్‌కి సంబంధించిన ఈ తొమ్మిది సెకన్ల వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో కేజ్రీవాల్ మాట్లాడుతున్న మాటలను బట్టి దేశ రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ క్లిప్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను ఓ జాతీయ మీడియా సంస్థ పరిశీలించింది. మొదట ఇది ఏఐ ద్వారా రూపొందించారని
అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని పరిశోధనల అనంతరం అలా చేయలేదని తేలింది.

READ MORE: Year Ender 2024: ఈ ఏడాది మార్కెట్‌ను ఊపు ఊపిన కార్లు ఇవే..

అయితే.. ఈ వీడియోఎప్పటిది? ఈ 9-సెకన్ల వీడియోలో ఈ వాక్యానికి ముందు లేదా తర్వాత ఏమి చెప్పారనేది దర్యాప్తు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు మరో 20 సెకన్ల వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “నేను అన్ని పార్టీల రాజ్యాంగాలను చదివాను. ఏ కాంగ్రెస్ వాది కూడా మద్యం సేవించరని కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉంది. ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారో వారు మద్యం తాగి రాసి ఉంటారని ఎవరో చెప్పారు” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Telangana Exhibitors Association: సీఎం రేవంత్ నిర్ణ‌యం థియేటర్స్‌కు ప్రాణం పోసిన‌ట్ట‌య్యింది!

ఇంతటితో ఆగకుండా ఈ చిన్ని క్లిప్‌కి చెందిన పూర్తి వీడియోను 25 నవంబర్ 2012న ఆమ్ ఆద్మీ పార్టీ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. దీన్ని పూర్తిగా చూసిన తర్వాత.. భారత రాజ్యంగంపై, రాజ్యాంగాన్ని రాసిన నేతలపై కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టమైంది. ఆయన కేవలం కాంగ్రెస్‌ను విమర్శించే ప్రయత్నంలో భాగంగా ఇలా మాట్లాడారు. ముందు వెనక మాటలు మిస్ అయ్యేలా.. వీడియోను కరెక్ట్‌గా తొమ్మిది సెకన్లు కట్ చేశారు. పూర్తి వీడియో చూడకుంటే నిజంగానే రాజ్యాంగ నేతలకు కేజ్రీవాల్ అవమానించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇది బీజేపీ కుట్ర అని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show comments