ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యాంగం, బాబా సాహెబ్ అంబేడ్కర్, రిజర్వేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు పరస్పరం దళిత వ్యతిరేకులుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో 'రాజ్యాంగం ఎవరు రాశారో వారు మద్యం తాగి రాసి ఉంటారు' అనే కేజ్రీవాల్ చెప్పినట్లు ఉంది.