Year Ender 2024: ఈ ఏడాది మార్కెట్‌ను ఊపు ఊపిన కార్లు ఇవే..
- కొన్ని రోజుల్లో ముగియనున్న 2024 ఏడాది
- ఈ ఏడాది ఆటోమొబైల్ రంగంలో ఎన్నో కొత్త మైలు రాళ్లు
- ఓ ఊపు ఊపిన పలు కార్ల గురించి తెలుసుకుందాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం ఎన్నో కొత్త మైలురాళ్లను సాధించింది. కంపెనీలు అనేక కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ఏడాది విడుదలైన కొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కొన్ని కార్ మోడల్‌లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. అవి మునుపటి కంటే సురక్షితంగా మారాయి. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం…
ఈ ఏడాదిలో వచ్చిన కొత్త ఈవీ కార్లు..
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా పంచ్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో ఈ ఏడాది 17 జనవరి 2024న మార్కెట్లో విడుదల చేసింది. టాటా మోటార్స్ తన మరో కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీని కూడా పరిచయం చేసింది. తర్వాత ఈ కారు పెట్రోల్ వెర్షన్ కూడా లాంచ్ అయింది. ఇది కాకుండా.. ఆల్-ఎలక్ట్రిక్ కారు రోల్స్ రాయిస్ స్పెక్టర్ కూడా ఈ సంవత్సరం ప్రారంభించారు. BYD సీల్, BMW i5 M60 XDrive, Porsche Macan EV, Mercedes-Benz EQA, Mercedes-Benz EQB ఫేస్‌లిఫ్ట్, MG విండ్సర్ EV, Kia EV9, BYD eMax7, మహీంద్రా BE 6, మహీంద్రా కార్లు కూడా ఈ సంవత్సరం విడుదలయ్యాయి.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
మారుతి సుజుకి డిజైర్..
మారుతి సుజుకి యొక్క మిడ్-సైజ్ సెడాన్ డిజైర్ కి చెందిన కొత్త ఎడిషన్ ఈ సంవత్సరం ఓ ఊపు ఊపింది. ఈ కారు డిజైన్ తో పాటు మంచి సెఫ్టీ రేటింగ్‌ని కూడా అందించింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గ్లోబల్ NCAP నుంచి కారు భద్రత పరంగా మొదటిసారిగా 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు పరిచయంతో కంపెనీ మార్కెట్లో పోటీని మరింత పెంచింది. అయితే.. మరోవైపు హోండా అమేజ్ కూడా కొత్త ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది.
మహీంద్రా థార్ రాక్స్..
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న.. ఐదు-డోర్ల మహీంద్రా థార్ రాక్స్ 15 ఆగస్టు 2024న ప్రారంభించారు. మహీంద్రా థార్ రాక్స్ కూడా పలు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్‌కు ₹ 22.49 లక్షల వరకు ఉంది. ఈ కారు దాదాపు 18 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్ MX1 RWD, టాప్ మోడల్ మహీంద్రా థార్ ROXX AX7L 4WD డీజిల్ AT.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!