NTV Telugu Site icon

UP: దెయ్యంపట్టిందంటూ.. మూడేళ్ల బాలిక ప్రాణం తీసిన తాంత్రికురాలు..

Up

Up

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మూడేళ్ల బాలికను.. ఓ మహిళా తాంత్రికురాలు పొట్టనబెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న బాలికను ఆ కుటుంబ సభ్యులు తాంత్రిక వద్దకు తీసుకువచ్చారు. బాలికను మూడు దెయ్యాలు ఆవహించాయని మహిళా తాంత్రిక తెలిపింది. వాటిని తొలగించేందుకు బాలికను బలంగా కొట్టడం ప్రారంభించింది. బాలిక రెండు అరచేతులను కాల్చేసింది. దీంతో బాలిక మృతి చెందింది. బాలిక జలుబుతో బాధపడుతుండగా.. వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా.. మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లారు కుటుంబీకులు.

READ MORE: Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..

విషయం ఏమిటంటే.. సందీప్ అనే యువకుడు ఉత్తర్ ప్రదేశ్ లోని రమియాబెహడ్‌ మిజారియా గ్రామానికి చెందిన వాడు. అతడి 3 ఏళ్ల కూతురు మహికి జ్వరం వచ్చింది. దీంతో తన కుమార్తెను వైద్యుల దగ్గరు తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం వైద్యులు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ సందీప్ కుటుంబం ఓ మహిళా తాంత్రికురాలి వద్దకు బాలికన తీసుకెళ్లింది. మంత్రగత్తే బాలికను మూడు దెయ్యాలు పట్టుకున్నాయని.. చెప్పింది. మంత్రాన్ని ఉపయోగించి బాలికను రక్షిస్తానని మాయమాటలు చెప్పింది. కొంత డబ్బును కూడా కుటుంబీకుల నుంచి వసూలు చేసింది.

READ MORE: Tamil nadu: తమిళనాడులో పీఎంకే పార్టీ కార్యకర్తపై హత్యాయత్నం

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంత్రిక మహిళ మొదట మహిని కొట్టి, కాలిన కుండతో ఆమె రెండు అరచేతులను కాల్చింది. బాలిక ఎంత అరిచినా వినిపించుకోలేదు. చిత్రహింసల కారణంగా మహిని పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబీకులు మళ్లీ బాలికను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో లక్నోకు తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చూయించుకునే స్తోమత లేకపోవడంతో కుటుంబీకులు తిరిగి ఇంటికి వచ్చేశారు. సమాచారం అందుకున్న రమియాబెహర్ ఎస్ ఐ వీరేంద్ర సింగ్ తోటి పోలీసుల నుంచి విరాళాలు సేకరించి చికిత్స నిమిత్తం బాలికను లక్నో పంపించారు. అయినా బాలిక మృతి చెందింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళా తాంత్రికురాలిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Show comments