NTV Telugu Site icon

Adibatla : వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం.. లేడీ వాయిస్‌తో ట్రాప్..!

Kidnap

Kidnap

Adibatla : ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి ఆగంతకులు కోటి రూపాయలను డిమాండ్ చేశారు. లేడీ వాయిస్‌తో ట్రాప్ చేయించి దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తుపాకీని తలపై పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి నారాయణను పోలీసులు కాపాడారు. నారాయణను కిడ్నాప్ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎంబీబీఎస్ డాక్టర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు అరెస్ట్ అయ్యారు.

Read Also: Minister Konda Surekha: ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం!

సినీ ఫక్కీలో కిడ్నాప్ ప్లాన్ చేసిన దుండగులు అరెస్టు అయినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. ఈ నెల 23న బట్టల వ్యాపారి రచ్చ నారాయణ కిడ్నాప్ అయినట్లు వెల్లడించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ఎంబీబీఎస్ డాక్టర్ , స్పోర్ట్స్ మెన్‌గా ఉన్న కొరివి ధనరాజ్ అరెస్ట్ అయినట్లు డీసీపీ చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడి నిందితులు నేరానికి పాల్పడినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో పోలీసు యూనిఫాం, పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. నిందితుల నుంచి ఓ పిస్టల్, పోలీసు యూనిఫాం, రెండూ కత్తులు, మూడు కోట్ల విలువ గల భూ ల్యాండ్ పత్రాలు , ఏడు సెల్ ఫోన్స్, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బట్టల వ్యాపారిని కిడ్నాప్‌ చేసి భయబ్రాంతులకు గురి చేసి భూమి పేపర్లపై ప్రధాన నిందితుడు ధనరాజ్ సంతకాలు పెట్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

Show comments