ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు బస్ ఎక్కించడం కోసమని బస్టాండ్ కు బయలుదేరారు. ఈ క్రమంలో.. ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Read Also: No Fish, No Wedding: చేపలు, మాంసాహారం లేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..
ప్రమాదంలో.. కూతురు అనితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ తల్లండి నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మొత్తం ఆటోలో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. పెనుమర్ల రాజిరెడ్డి అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణమైన కంటైనర్ వాహనం CG17KZ5900గా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయరహదారిపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాలను అక్కడి నుంచి మార్చురీకి తరలించారు.