దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు 1,000 అడుగుల లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఇంకెంత మంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. తయాబాంబా నుంచి లిమా వెళ్తుండగా ఉత్తర పెరువియన్ జిల్లా కుస్కాలోని రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కాగా.. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. పెరూలో జరిగే ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది.
Kodali Nani: అంతరిక్షం నుంచి వచ్చినా గుడివాడలో నన్ను ఓడించలేరు..
పెరూలో రోడ్డు ప్రమాదాలు చాలా సాధారణంగా జరుగుతాయి. గత సెప్టెంబరులో జరిగిన ప్రమాదంలో దాదాపు రెండు డజన్ల మంది మరణించారు. 2023 జనవరిలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 24 మంది మరణించారు.