NTV Telugu Site icon

Anakapalle: సింహాద్రి NTPCలో ఘోర ప్రమాదం.. కేబుల్ ట్రాకి విరిగిపడి ఇద్దరు మృతి

Ntpc

Ntpc

అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి NTPCలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కేబుల్ ట్రాక్ విరిగిపడడంతో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Emergency Landing: హిమాచల్‌ సీఎంకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

సుమారు 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. NTPCలో మెయింటెనెన్స్ పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుల అంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.