Andhrapradesh: దేశంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాల్లో సంగతి పక్కనబెడితే.. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మద్య కాలంలో కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో యువతులను వేధిస్తున్నారు.. తమను కాదంలే బ్లేడ్, కత్తులతో దాడులకు ఎగబడుతున్నారు. తాజాగా ఓ యువతిపై ప్రేమోన్మాది రెచ్చిపోయి దాడి చేశాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. నంద్యాలలోని ఎస్‌బీఐ కాలనీలో గల డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. టెక్కే సుంకులమ్మ విధికి చెందిన శ్రీకాంత్‌కు , డిగ్రీ కాలేజీలో చదువుతున్న యువతికి ఏడాది క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా చనువుగా మారింది. దీంతో శ్రీకాంత్ ఆ అమ్మాయిని తనను ప్రేమించమని వేధింపులకు గురిచేశాడు.
Also Read: Hyderabad: ఏరోసిటీగా శంషాబాద్ అభివృద్ధి.. జంట నగరాలకు తోడుగా మరో నగరం
వేధించడమే కాకుండా కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిపై శ్రీకాంత్ దాడి చేశాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కొని శ్రీకాంత్ ఆ అమ్మాయిని దారుణంగా కొట్టాడు. ఎన్జీఓ కాలనీలోని అపార్ట్మెంట్ వరకు విద్యార్థిని తన్నుకుంటూ వెళ్లాడు ఆ ప్రేమోన్మాది. అపార్ట్మెంట్ వద్ద శ్రీకాంత్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.