NTV Telugu Site icon

STAR Hospital: మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమం.. ముఖ్య అతిథిగా హీరో శ్రీకాంత్

Star

Star

రొమ్ము క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి మహిళలలో ఎక్కువగా వస్తుంది. దీనిలో అసాధారణ రొమ్ము కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణితులను ఏర్పరుస్తాయి. ఇలాగే వదిలేస్తే.. ట్యూమర్లు శరీరమంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారతాయి. అయితే.. స్టార్ హాస్పిటల్స్‌లో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. హైదరాబాద్‌లోని STAR హాస్పిటల్స్‌లో ఉత్తమ హెమటాలజిస్టులు అన్ని రకాల రక్త రుగ్మతలకు ప్రపంచ స్థాయి చికిత్సను అందిస్తున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి..

స్టార్ హాస్పిటల్స్‌లో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స పొంది.. ఆ రోగం నుంచి బయటపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం .. మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆ వ్యాధి నుంచి బయటపడిన వారితో కార్యక్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సినీ హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ హాస్పిటల్స్ అందించిన చికిత్స వివరాలను గురించి వెల్లడించనున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పనున్నారు. ఎవరైనా ఆసక్తి గల వారుంటే.. ఈ కార్య్రమంలో పాల్గొనాల్సిందిగా స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం సూచించింది. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్స్ 11వ అంతస్తులో జరుగనుంది. వివరాల కోసం: 92465 20296 ఈ నెంబర్ ను సంప్రదించండి..

Read Also: Himanta Biswa Sarma: కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటోంది.. హిమంత సంచలన ఆరోపణ..