NTV Telugu Site icon

Hyderabad: గంజాయి అమ్ముతూ పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

Ganja In Hydrabad

Ganja In Hydrabad

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన సంతోష అనే వ్యక్తి తరచూ అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి రమేష్ బాబుకి ఇచ్చి అమ్మకాలు జరిపిస్తూ ఉంటాడు. శుక్రవారం కూడా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన గంజాయిని రమేష్ బాబుకి ఇస్తున్న సమయంలో ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు.

READ MORE: Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం

సంతోష్ మాత్రం గంజాయి ఇచ్చి దొరక్కుండా పరారయ్యాడు. గంజాయి అమ్మకాలను చేపడుతున్న భరత్ రమేష్ బాబు మాత్రం ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు, సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి వద్ద 1.1 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిలో సీఐ నాగరాజు తోపాటు ఎస్ఐ జ్యోతి, హెడ్ కానిస్టేబుల్ అలీమ్, కానిస్టేబుళ్లు శశికిరణ్ కార్తీక్ ఉన్నారు. ఈ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, ఎస్టీఎఫ్ డీఎస్సీ తిరుపతి యాదవ్ అభినందించారు.

READ MORE: Swiggy Instamart: హైదరాబాద్‌లో “స్విగ్గీ ఇన్‌స్టామార్ట్” హవా.. 2024లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారంటే?

Show comments